జ్యోతిషం -ప్రాధమిక అంశాలు Fundamentals in Jyotisham in Telugu for beginners

 

శ్రీ గణాధిపతయే నమః

శ్రీ హయగ్రీవాయ నమఃశ్రీ మహా సరస్వత్యై నమః

శ్లోఙ్ఞానానంద మయం దేవం,నిర్మలస్ఫటికాకృతిం

ఆధారం సర్వ విద్యానాం శ్రీ యగ్రీవ ముపాస్మహే

జ్యోతిషం -ప్రాధమిక అంశాలు

Fundamentals in Jyotisham in Telugu

for beginners

నక్షత్రాలు-రాశులు { naxatraalu-raashulu}

STARS- ITS POSITION in  ZODIAC CONSTELLATION



నక్షత్రాలు 27 .ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది.

పాదాలనే చరణం అని కూడా అంటారు.ఒక్కొక్క పాదాని ఒక అక్షరం తో లేదా ఒక పేరుతో సూచిస్తాము.

ఒక్కొక్క నక్షత్ర వ్యవధి లేదా నిడివి సుమారు 24 గం.లు..కాని ఒక్కొక్కసారి 26 గం.లనుండి 22 గం.లవరకు మారుతుంటుంది. ఆయా నక్షత్ర సమయము లో పుట్టిన వ్యక్తి కి ఆయా పాదాల పేరు జన్మ నామం అవుతుంది.. ఇలా పుట్టిన సమయాన్నిబట్టి నిర్ణయించ బడేది జన్మనామం. బార సాల రోజు , 21 రోజు లేదా నామ కరణం రోజు తల్లి తండ్రులు పెట్టేది వ్యవహార నామం. జ్యోతిష పరంగా ముహుర్తాలు నిర్ణయించుకోవడానికి జన్మ నామం ను పరిగణన లోకి తీసుకోవడం అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వ్యవహార నామం కూడ అవసరముతుంది.

మొదటి నక్షత్రం..అశ్విని. దీనికి నాలుగు పాదాలు. అవి. 1.చు 2.చె 3. చో 4. ల.


గుర్తు పెట్టుకోవడానికి, చుక్కయ్య,చెన్నయ్య,చొక్కయ్య,లక్ష్మయ్య అని గుర్తు

పెట్టుకోవచ్చు. అశ్విని నక్షత్ర వ్యవధిని నాలుగు భాగాలు చేయగా మొదటి

భాగం లో పుట్టిన వ్యక్తి జన్మ నామం చుక్కయ్య లేదా చుక్కమ్మ అని రెండవ

భాగము లో పుట్టిన వ్యక్తి జన్మ నామం చెన్నయ్య లేదా చెన్నమ్మ అని మూడవ

భాగం లో అయితే చొక్కయ్య చొక్కమ్మ అని ఇలాగే నాలుగవ భాగం లో అయితే

లక్ష్మయ్య లేదా లక్ష్మి అని జన్మ నామం చెప్పడం జరుగుతుంది.

 

 ఆయా నక్షత్ర సమయము లో పుట్టిన వ్యక్తి కి  ఆయా పాదాల పేరు జన్మ నామం అవుతుంది.. ఇలా పుట్టిన సమయాన్నిబట్టి నిర్ణయించ బడేది జన్మనామం.

బార సాల రోజు , 21 రోజు లేదా  నామ కరణం రోజు తల్లి తండ్రులు పెట్టేది

వ్యవహార నామం. జ్యోతిశ పరంగా ముహుర్తాలు నిర్ణయించుకోవడానికి  జన్మ

నామం ను పరిగణన లోకి తీసుకోవడం అవుతుంది. అయితే  కొన్ని

సందర్భాలలో వ్యవహారం కూడ అవసరముతుంది. 

    

నక్షత్రాలు- వాటి పాదాలు

{naxatraalu-paadaalu) stars- and its 4 parts in jyotisham

 

1.    చు  చె చొ ల …….అశ్విని     { చుక్కయ్య, చెన్నయ్య, చొక్కయ్య,లక్ష్మయ్య}

2.    లీ లు లే లో……….భరణి.      { లింగయ్య, లుక్కయ్య,లేగయ్య లోకయ్య }

3.      ఈ ఊ ఏ………….కృత్తిక    { అనంత, ఈశ్వర,ఉమ,ఏకాంబర }

4.     ఓ వా వీ వు………...రోహిణి     { ఓంకారం, వామన్, వీరాజు, వూటూరి }

5.    వే వో కా కి…………. మృగశిర   { వెంకటయ్య, వోగయ్య, కాంతం, కిష్టయ్య}

6.     కు ,ఘం,ఙ్ఞ చ… ….ఆర్ద్ర       { కుర్మయ్య, ఘంటయ్య, ఙ్ఞానయ్య, చక్రయ్య}

7.     కే కో హా హీ ……..పునర్వసు    { కేసయ్య, కోనయ్య, హనుమయ్య, హిమవంతు}

8.     హూ  హే హో డ ….పుష్యమి   { హుతాశన, హేరంభ, హోతయ్య, డక్కయ్య}

9.     డీ  డు డే డో…………....ఆశ్లేష     { డిక్కయ్య, డుక్కయ్య, డేగయ్య డోగయ్య}

10.    మా  మీ  మూ  మే..….మఘ   {మల్లయ్య మీనయ్య ముక్కంటి,మేఘన}

11.     మో  టా టి   టు .. …..పుబ్బ   {మోహిని, టాకయ్య, టిక్కయ్య, టుక్కయ్య}

12.    టే టో పా పి   ……..ఉత్తర      { టెక్కయ్య, టొక్కయ్య పాపయ్య పిచ్చయ్య }

13.     పూ ష ణ ఠ………...హస్త        {మల్లయ్య,షణ్ముఖుడు, ణణ్ణాజి, ఠక్కరుసు }

14.     పే   పో రా  రి………చిత్త        {పెద్దయ్య,పోతయ్య, రామయ్య రిక్కమ్మ }

15.     రూ  రే రో త ……..స్వాతి.      { రుక్కమ్మ రేణుక, రోచిష్ణు, తమ్మయ్య  }

16.     తీ   తు  తే  తో....విశాఖ        {తిక్కయ్య తుక్కమ్మ తేగయ్య తోటమ్మ }

17.    నా  నీ  ను నే..…..అనూరాధ   {నాగయ్య నీలిమ నూకాలమ్మ నేమయ్య}

18.    నో యా  యీ  యు…  జ్యేష్ట     { నోకయ్య యామిని యీలయ్య యుగావతి}

19.    యే   యో బా  బి…..మూల…….{ యేశయ, యోగయ్య బాలమ్మ బిందు }

20.    బూ  ధా  భా  ఢా…. పూర్వాషాడ  { బుచ్చయ్య, దామోదర, భాస్కర్, డాక్టర్}

21.    బే  బో జా  జి…ఉత్తరాషాడ         {బేకయ, బోగయ్య జానయ్య జిక్కయ్య}

22.    జు  జే జో ఖ…..శ్రవణం.         {జుక్కయ్య జేజమ్మ జోగయ్య  ఖన్నా}

23.    గా  గి  గూ  గే ….ధనిష్ట         { గంగయ్య గిరిధారి, గుండయ్య,గేయయ్య}

24.    గో  సా  సీ  సు…..శతభిషం  { గోపయ్య సాంబయ్య సీనయ్య సుధాకర్ }

25.    సే  సో దా  ది….పూర్వాభాద్ర   {సేనయ్య సోమయ్య దాశరధి దినకర్}

26.     దు  శం ఝా  థ …ఉత్తరా భాద్ర  { దుర్గ, శంకరుడు,ఝంకారుడు, థక్కయ్య}

27.    దే దో చా  చి ..రేవతి              { దేవయ్య, దొండయ్య చామంతి చింతామణి}

 

          మొత్తం  27 నక్షత్రాలు 27X4= 108 పాదాలు.

       ఈ 108 పాదాలను 12 భాగాలుగ విభజించి ఒక్కొక్క భాగానికి ఒక రాశి పేరు

      పెట్టడం జరిగింది. రాశులు.. 12.

1. మేషం

2. వృషభం.

3. మిధునం

4. కర్కాటం 

5. సింహం, 

6,  కన్య, 

7. తుల 

8. వృశ్చికం

9. ధనుస్సు

10. మకరం

11. కుంభం

12. మీనం.

 

పై 108 పాదాలను 12 రాశులకు విభజించగా ఇలా ఉంటాయి.

 

1.      చూ   చే  చో ల, లీ లు లే లో,  ఆ  ……… మేషం.

2.      ఈ    ఊ  ఏ, ఓ వా వీ   వు , వే వో …….వృషభం.

3.      కా కి, కూ ఘం ఛ ,కే కో హా………...  మిధునం.

4.     హీ , హూ  హే హో డ,  డీ డు డే డో…………..కర్కాటకం

5.    మా మీ  మూ  మే,  మో  టా టి   టు, టే….  సింహం.

6.     టో పా పి,   పూ ష ణ ఠ, పే   పో… ……కన్య 

7.     రా  రి, రూ రే రో త, తీ  తు తే … ………. తు ల 

8.    తో, నా  నీ  ను నే,  నో యా  యీ  యూ……  వృశ్చికం

9.    యే   యో బా  బి,  బూ  ధా  భా  ఢా,  బే……. ధనుస్సు

10.   బో జా  జి, జు  జే జో ఖ , గా  గి…………మకరం

11.     గూ  గే, గో  సా  సీ  సు, సే  సో దా …..….కుంభం.

12.     ది , దు  శం  ఝా  థ, దే దో చా  చి….…….మీనం

 

      నక్షత్రాల పరంగా ఇలా అన్వయించుకోవచ్చు.

1.    అక్ష్విని, భరణి కృత్తికాః పాదం….మేషం

అనగా అశ్విని 4 పాదాలు భరణి 4 పాదాలు కృత్తిక ఒక పాదం కలిసి మేష రాశి అవుతుంది.

2.    కృత్తికాఃస్త్రయో పాదం రోహిణి మృగశిరార్ద్రం… వృషభం

కృత్తికా మిగతా 3 పాదాలు రోహిణి 4 పాదాలు మృగశిర మొదటి రెండు పాదాలు వృషభం

3.    మృగశిరార్ద్రం ఆర్ద్ర పునర్వసు త్రయోర్మిధునం.

మృగశిర మిగతా రెండు పాదాలు ఆర్ద్ర 4 పాదాలు పునర్వసు 3 పాదాలు  కల్సి మిధునం

4.     పునర్వసు పాదం పుశ్యమి ఆశ్లేషాంతం కర్కాటకం .

పునర్వసు మిగతా ఒక పాదం  పుష్యమి  4 పాదాలు  ఆశ్లేష 4 పాదాలు కల్సి  కర్కాటకం .

       ఇప్పటివరకు మొత్తం 27 నక్షత్రాలలో 9 నక్షత్రాలు 4 రాశులలో చేర్చబడినవి. అందుచే ఈ మొదటి తొమ్మిది నక్షత్రాలను అనగా అశ్విని నుండి ఆశ్లే ష వరకు ప్రధమ నవకము గా పేర్కొన బడుతుంది.

 

5.     మఘ పుబ్బ ఉత్తరాః పాదం సింహం

మఘ -4 పాదాలు,పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం కల్సి సింహ రాశి.

6.     ఉత్తరాస్త్రయోఃపాదం హస్తమి చిత్తార్ద్రం …కన్య

ఉత్తర మిగతా మూడు పాదాలు హస్త 4 పాదాలు చిత్త మొదటి రెండు పాదాలు  కన్య రాశి

7.     చిత్త్రార్ధం స్వాతి విశాఖాఃత్రయస్తులా।

చిత్త మిగత రెండు పాదాలు స్వాతి 4 పాదాలు విశాఖ మూడు పాదాలు తులా రాశి

8.     విశాఖపాదం అనూరాధ జ్యేష్టాంత్యం… వృశ్చికం.

విశాఖ చివరి(4 వ) పాదం, అనురాధ 4 పాదాలు,జ్యేష్ట 4 పాదాలు  వృశ్చిక రాశి.

          9 నక్షత్రాలు (10 నుండి 18 వరకు} 4 రాశులలో చేర్చబడినవి.ఈ రెండవ

  తొమ్మిది నక్షత్రాలను అనగా మఘ  నుండి జ్యేష్ట  వరకు ద్వితీయ  నవకము గా పేర్కొన బడుతుంది.

 

9.     మూలా పూర్వాషాడ ఉత్తరాషాడ పాదం… ధనుస్సు

మూల 4 పాదాలు, పూర్వాషాడ 4 పాదాలు, ఉత్తరాషాడ మొదటి పాదం కల్సి ధనుర్రాశి.

10.   ఉత్తరాషాడాఃస్త్రయో పాదం శ్రవణ ధనిష్టార్ధం…. మ కరం

ఉత్తరాషాడ మిగతా 3 పాదాలు శ్రవణం 4 పాదాలు ధనిష్ట మొదటి రెండు పాదాలు మకరం.

11.     ధనిష్టార్ధం శతభిషం పూర్వాభాద్రఃస్త్రయః…కుంభం

ధనిష్ట మిగతారెండు పాదాలు, శతభిషం 4 పాదాలు పూర్వా భాద్ర మొదటి 3 పాదాలు కుంభం

12.  పూర్వాభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం

       పూర్వాభాద్ర  చివరి పాదం ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి నాలుగు పాదాలు మీన రాశి.

         9 నక్షత్రాలు (19 నుండి 27 వరకు} 4 రాశులలో చేర్చబడినవి.ఈ  మూడవ

  తొమ్మిది నక్షత్రాల గుంపును అనగా మూల  నుండి రేవతి   వరకు  తృతీయ  నవకము గా పేర్కొన బడుతుంది.

     తొందరగా గుర్తుపెట్టుకోవడానికి ఈ  12 వాక్యాలు  కంఠస్థం చేయాలి.

1.అశ్విని, భరణి కృత్తికాః పాదం….మేషం.

2.  కృత్తికాఃస్త్రయో పాదం రోహిణి మృగశిరార్ద్రం… వృషభం

3.మృగశిరార్ద్రం ఆర్ద్రా పునర్వసు త్రయోర్మిధునం.

4.     పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం .

     5. మఘ పుబ్బ ఉత్తరాః పాదం సింహం

     6. ఉత్తరాస్త్రయోఃపాదం హస్తమి చిత్తార్ద్రం …కన్య

     7. చిత్త్రార్ధం స్వాతి విశాఖాఃత్రయస్తులా।

     8.విశాఖపాదం అనూరాధ జ్యేష్టాంత్యం… వృశ్చికం.

9.మూలా పూర్వాషాడ ఉత్తరాషాడ పాదం… ధనుస్సు

10. ఉత్తరాషాడాఃస్త్రయో పాదం శ్రవణ ధనిష్టార్ధం…. మ కరం

11.ధనిష్టార్ధం శతభిషం పూర్వాభాద్రాస్త్రయః…కుంభం

12.పూర్వాభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం.

 

Comments

Popular posts from this blog

ఘాత వారం, ఘాతతిథి,ఘాత నక్షత్రం ఘాతచంద్రుడు

భ చక్రం లేదా దిక్చక్రం