భ చక్రం లేదా దిక్చక్రం

 
                 భ చక్రంలేదా దిక్చక్రం

       మనం ఆకాశంలో వీక్షించే మార్గాన్ని దిక్చక్రమ్ లేదా భ చక్రమ్
   అంటారు..ఈనక్షత్ర మండలాన్ని 12 భాగాలుగా విభజన 
చేయడం జరిగింది.  ఈ 12 భాగాలకే    రాశులు(zodiacs)అని పేరు.
.మేషమ్ నుండి మీనం వరకు కనిపించే 
ఈ రాశులు,    అందులో ఉండే నక్షత్ర సముదాయాల ఆకార రూపన్ని
 బట్టి  ఆయా రాశులకు ఆయా పేర్లు ఇవ్వడం జరిగింది.
ఉదాహరణకు అశ్విని,భరణి,మరియు కృత్తిక ఒక   పాదం కలిపి
 మేష రాశి అవుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాము.
అశ్విని అంటే ఒకే ఒక నక్షత్రం కాదు.3 నక్షత్రాల గుంపు,
అలాగే భరణి అనేది  3 నక్షత్రాల సముదాయం.
కృత్తిక -6నక్షత్రాల గుంపు,
 (అశ్విని-3 తారలు,భరణి -3  తారలు , కృత్తిక నక్షత్ర
 సముదాయం లోని కొంత భాగం కలిపి మేషం తల(గొర్రె) ఆకారమ్ లో ఉంటుంది)
నక్షత్రాలు--------ఆకృతులు
అశ్విని---…తురగాముఖాశ్వినీ త్రీణి(గుర్రం ముఖం-3)
భరణి-…….. భరణి యోని తృణి (యోని ఆకృతి-3)
కృత్తికా…… కృత్తికాక్షురాషట్కం(మంగలికత్తి ఆకృతి-6)
రోహిణి------రోహిణి శకటం పంచ (బండి ఆకృతి-5)
మృగశిర…. మృగశిరా శీర్షత్రయం (తల ఆకృతి-3)
ఆరుద్ర…..ఆర్ద్రా ప్రవాళమేకం (పగడం ఆకృతి-1)
పునర్వసు—పునర్వసు కులాల చక్రం పంచ(కుమ్మరి సారే ఆకృతి-5)
పుష్యమి-----సరళాపుష్యమీ త్రీణీ(సరళరెఖ ఆకృతి లో 3)
ఆశ్లేషా-----ఆశ్లేషా సర్పా ఋతూ(సర్పాకృతి-6)
మఖ…….మఖాందోళికా పంచ(పల్లకీ ఆకృతి-5)
పుబ్బ…….పుబ్బా ఉత్తర నేత్ర ద్వయోః(కంటి ఆకృతి-2)
ఉత్తర…..పుబ్బా ఉత్తర నేత్ర ద్వయోః(కంటి ఆకృతి-2)
హస్తా……..హస్తా పాణినాం పంచ(చేతి వేళ్ళ ఆకృతి-5)
చిత్తా……..చిత్తా మౌక్తికమేకం(ముత్యం ఆకృతి-1)
స్వాతి….స్వాతీ మాణిక్యమేకమ్(మాణిక్య ఆకృతి-1)
విశాఖ…విశాఖా కులాల చక్రం పంచ(కుమ్మరి సారే ఆకృతి-5)
అనూరాధ….ఛత్రాకార త్రయం(గొడుగు ఆకృతి-3)
జ్యేష్ట……. ఛత్రాకార త్రయం(గొడుగు ఆకృతి-3)
మూలా……మూలా కుప్యత్కేసరీ పంచ(కోపించిన కోతి-5)
పూర్వాషాడ-….. పూర్వాషాడ ఉత్తరాషాడ ద్వే ద్వే భేకం(కప్ప-2)
ఉత్తరాషాడ…….. పూర్వాషాడ ఉత్తరాషాడ ద్వే ద్వే భేకం(కప్ప-2)
శ్రవణమ్………..శ్రవణం  మత్స్యాకార త్రయం(చేప-3)
ధనిష్ట….….  ధనిష్టాశీర్ష త్రయం (తల ఆకృతి-3)
శత భిశం….శతభిషక్చతమ్ తారాః(100 తారల గుంపు)
పూర్వాభాద్ర .. పూర్వాభాద్ర ఉత్తరాభాద్రా ద్వే ద్వే  ఖట్వం(మంచం-2)
  ఉత్తరాభాద్ర………  పూర్వాభాద్ర ఉత్తరాభాద్రా ద్వే ద్వే  ఖట్వం(మంచం-2)
రేవతి………రేవతీ మత్స్యాకార త్రయం (చేప ఆకృతి-3)
అభిజిత్ నక్షత్రం 3 తారలతో త్రికోణాకారముగా నుండును.

 

Comments

Popular posts from this blog

ఘాత వారం, ఘాతతిథి,ఘాత నక్షత్రం ఘాతచంద్రుడు

జ్యోతిషం -ప్రాధమిక అంశాలు Fundamentals in Jyotisham in Telugu for beginners