భ చక్రం లేదా దిక్చక్రం
భ చక్రంలేదా దిక్చక్రం మనం ఆకాశంలో వీక్షించే మార్గాన్ని దిక్చక్రమ్ లేదా భ చక్రమ్ అంటారు..ఈనక్షత్ర మండలాన్ని 12 భాగాలుగా విభజన చేయడం జరిగింది. ఈ 12 భాగాలకే రాశులు(zodiacs)అని పేరు. .మేషమ్ నుండి మీనం వరకు కనిపించే ఈ రాశులు, అందులో ఉండే నక్షత్ర సముదాయాల ఆకార రూపన్ని బట్టి ఆయా రాశులకు ఆయా పేర్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు అశ్విని,భరణి,మరియు కృత్తిక ఒక పాదం కలిపి మేష రాశి అవుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాము. అశ్విని అంటే ఒకే ఒక నక్షత్రం కాదు.3 నక్షత్రాల గుంపు, అలాగే భరణి అనేది 3 నక్షత్రాల సముదాయం. కృత్తిక -6నక్షత్రాల గుంపు, (అశ్విని-3 తారలు,భరణి -3 తారలు , కృత్తిక నక్షత్ర సముదాయం లోని కొంత భాగం కలిపి మేషం తల(గొర్రె) ఆకారమ్ లో ఉంటుంది) నక్షత్రాలు -------- ఆకృతులు అశ్విని---…తురగాముఖాశ్వినీ త్రీణి(గుర్రం ముఖం-3) భరణి-…….. భరణి యోని తృణి (యోని ఆకృతి-3) కృత్తికా…… కృత్తికాక్షురాషట్కం(మంగలికత్తి ఆకృతి-6) రోహిణి------రోహిణి శకటం పంచ (బండి ఆకృతి-5) మృగశిర…. మృగశిరా శీర్షత్రయం (తల ఆకృతి-3) ఆరుద్ర…..ఆర్ద్రా ప్రవాళమేకం (పగడం ఆకృతి-1) పునర్వసు—పునర్వస