Posts

భ చక్రం లేదా దిక్చక్రం

                     భ చక్రంలేదా దిక్చక్రం         మనం ఆకాశంలో వీక్షించే మార్గాన్ని దిక్చక్రమ్ లేదా భ చక్రమ్    అంటారు..ఈనక్షత్ర మండలాన్ని 12 భాగాలుగా విభజన  చేయడం జరిగింది.  ఈ 12 భాగాలకే    రాశులు(zodiacs)అని పేరు. .మేషమ్ నుండి మీనం వరకు కనిపించే  ఈ రాశులు,    అందులో ఉండే నక్షత్ర సముదాయాల ఆకార రూపన్ని  బట్టి  ఆయా రాశులకు ఆయా పేర్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు అశ్విని,భరణి,మరియు కృత్తిక ఒక   పాదం కలిపి  మేష రాశి అవుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాము. అశ్విని అంటే ఒకే ఒక నక్షత్రం కాదు.3 నక్షత్రాల గుంపు, అలాగే భరణి అనేది  3 నక్షత్రాల సముదాయం. కృత్తిక -6నక్షత్రాల గుంపు,  (అశ్విని-3 తారలు,భరణి -3  తారలు , కృత్తిక నక్షత్ర  సముదాయం లోని కొంత భాగం కలిపి మేషం తల(గొర్రె) ఆకారమ్ లో ఉంటుంది) నక్షత్రాలు -------- ఆకృతులు అశ్విని---…తురగాముఖాశ్వినీ త్రీణి(గుర్రం ముఖం-3) భరణి-…….. భరణి యోని తృణి (యోని ఆకృతి-3) కృత్తికా…… కృత్తికాక్షురాషట్కం(మంగలికత్తి ఆకృతి-6) రోహిణి------రోహిణి శకటం పంచ (బండి ఆకృతి-5) మృగశిర…. మృగశిరా శీర్షత్రయం (తల ఆకృతి-3) ఆరుద్ర…..ఆర్ద్రా ప్రవాళమేకం (పగడం ఆకృతి-1) పునర్వసు—పునర్వస

ఘాత వారం, ఘాతతిథి,ఘాత నక్షత్రం ఘాతచంద్రుడు

             ఘాత వారం, ఘాతతిథి,ఘాత నక్షత్రం ఘాతచంద్రుడు   శ్లో॥ మేషేచ భానుర్మఘ జన్మ షష్టి। వృషేకరా పంచ చతుర్థి సౌరి।       యుగ్మేనవా మారుత మష్ట మిందు।కుళీర బాహుర్బుధమైత్రి షష్టి॥      హరీరసా మూల శని ర్నవమ్యాం।సతీచ విష్ణుర్దశ సౌరిరష్టమి।      తౌల్యాగ్నిజీవే శత తార ద్వాదశి।అళిర్మునిర్ భార్గవ బీజ రేవతి॥     ధనుర్యుగశుక్ర యమంచ బీజం।మృగేవసుబ్రాహ్మ్య కుజశ్చ ద్వాదశి।    ఘటారుద్ర రుద్రాశ్చ చతుర్థ జీవే।మీనార్క సార్పా భృగుబీజయోశ్చ॥   వాణిజ్య యాత్రాచ తటాకవాపి వాస్తు ప్రవేశే కృషి ఘాత వర్జ్యః॥    జన్మ రాశి ఘాత వారం ఘాత నక్షత్రం ఘాత తిథి ఘాత చంద్రుడు. 1. మేషం ఆది వారం మఘ షష్టి జన్మ చంద్రుడు 2. వృషభం శని వారం హస్త చతుర్థి 5 వ   “” 3. మిధునం సోమ వారం స్వాతి అష్టమి 9 వ “” 4. కర్కాటకం బుధ వారం అనూరాధ షష్టి 2 వ 5. సింహం శని వారం

జ్యోతిషం -ప్రాధమిక అంశాలు Fundamentals in Jyotisham in Telugu for beginners

  శ్రీ గణాధిపతయే నమః ॥ శ్రీ హయగ్రీవాయ నమః ॥ శ్రీ మహా సరస్వత్యై నమః ॥ శ్లో ॥ ఙ్ఞానానంద మయం దేవం , నిర్మలస్ఫటికాకృతిం ॥ ఆధారం సర్వ విద్యానాం శ్రీ యగ్రీవ ముపాస్మహే ॥ జ్యోతిషం -ప్రాధమిక అంశాలు Fundamentals in Jyotisham in Telugu for beginners నక్షత్రాలు-రాశులు { naxatraalu-raashulu} STARS- ITS POSITION in   ZODIAC CONSTELLATION నక్షత్రాలు 27 .ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది. పాదాలనే చరణం అని కూడా అంటారు.ఒక్కొక్క పాదాని ఒక అక్షరం తో లేదా ఒక పేరుతో సూచిస్తాము. ఒక్కొక్క నక్షత్ర వ్యవధి లేదా నిడివి సుమారు 24 గం.లు..కాని ఒక్కొక్కసారి 26 గం.లనుండి 22 గం.లవరకు మారుతుంటుంది. ఆయా నక్షత్ర సమయము లో పుట్టిన వ్యక్తి కి ఆయా పాదాల పేరు జన్మ నామం అవుతుంది.. ఇలా పుట్టిన సమయాన్నిబట్టి నిర్ణయించ బడేది జన్మనామం. బార సాల రోజు , 21 రోజు లేదా నామ కరణం రోజు తల్లి తండ్రులు పెట్టేది వ్యవహార నామం. జ్యోతిష పరంగా ముహుర్తాలు నిర్ణయించుకోవడానికి జన్మ నామం ను పరిగణన లోకి తీసుకోవడం అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో